దొంతికుంట చెరువు సర్వే ఆలస్యం

* అక్రమణల భయంతో ప్రజల ఆందోళన. * సరైన సర్వేతో మాత్రమే విముక్తి సాధ్యం.

జనం న్యూస్ మార్చ్ 22 అశ్వరావుపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నియోజకవర్గ ప్రతినిధి ఎం నాగేశ్వరరావు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, మండలంలోని పురాతన దొంతికుంట చెరువు రైతుల జీవనాధారం అయినప్పటికీ ఆక్రమణల కారణంగా వినాశనానికి బాటపడేలా ఉందని ప్రజల్లో ఆందోళన వ్యాప్తి చెందింది. పూర్తి స్థాయి సర్వే జరగకపోవడం వలన అసలు విస్తీర్ణం, ఆక్రమణ స్థాయి స్పష్టంగా తెలియడం లేదు. ప్రజలు కోరినట్లుగా చెరువును ఖబంధహస్తాల నుండి విముక్తి చేసి రక్షణ చర్యలు చేపట్టాలని, అసలు విస్తీర్ణాన్ని రికార్డులో నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కోట్ల రూపాయల నిధులు కేటాయించినప్పటికీ, సర్వే ఆలస్యంతో అభివృద్ధి పనులపై అనుమానాలు ఇంకా కొనసాగుతున్నాయి. స్థానికులు మరియు రైతులు అధికారులు సక్రమంగా పూర్తి సర్వే నిర్వహించి చెరువును భవిష్యత్తుకి రక్షించాలని, అభివృద్ధి పనులు వేగవంతంగా సాగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *