
జనం న్యూస్ మార్చ్ 22 పోలవరం నియోజకవర్గం రిపోర్టర్ సోమరాజు నడపాల: పోలవరం మండలం కొండ్రు కోట పంచాయతీ పరిధిలో తెల్లవరం గ్రామం చెందిన కుంజా సీత సెకండ్ ఏ.ఎన్.ఎమ్ గా పనిచేస్తూ, గత రెండు సంవత్సరాల క్రితం ఆమె మరణించారు. ఆమెకు భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త సంఘం ముత్యాల రావు కొన్ని రోజుల క్రితం యాక్సిడెంట్ లో స్పృహ కోల్పోవడం జరిగింది. ఆయన పరిస్థితి సీరియస్ గా ఉండడం వలన రాజమండ్రి సాయి హాస్పిటల్లో సుమారు పది రోజుల నుండి ఐసియులో చికిత్స పొందుతున్నారు. వారి కుటుంబ సభ్యులును కలసి విషయం తెలుసుకున్న ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వారు అసోసియేషన్ నుండి ఆర్థిక సహాయం కింద 20 వేల రూపాయలు అలాగే కోండ్రుకోట పి.హెచ్.సి నుండి డాక్టర్ జ్ఞానేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది అందరు కలిసి తమకు తోచినంత ఆర్థిక సహాయం క్రింద 27 వేల రూపాయలను తమ కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. తమ పరిస్థితి తెలుసుకుని ముందుకు వచ్చి సహాయం చేసినందుకు కుటుంబం సభ్యులు అసోసియేషన్ వారికి, కోండ్రుకోట పి.హెచ్.సి సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట జనరల్ సెక్రెటరీ పూసం వెంకటేశ్వరరావు, ఏలూరు జిల్లా ప్రెసిడెంట్ సున్నం శ్రీ రాములు దొర, మండల అద్యక్షులు కూరం ప్రసాద్, కోండ్రుకోట పి.హెచ్.సి డాక్టర్ జ్ఞానేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు.