పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్న జనసైనికులు

జనం న్యూస్ మార్చి 15 ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ స్తూపాన్ని ఆవిష్కరించిన జనసేన ప్రధాన కార్యదర్శి.. సంజయ్ జనసేన పార్టీ పదమూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు భూదేవిపేట లో వేలేరుపాడు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మేచినేని, సంజయ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి, మొదట జనసేన పార్టీ దిమ్మ మరియు జండా ఆవిష్కరణ కార్యక్రమం కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది, అనంతరం జనసైనికులు మధ్యన కేక్ కటింగ్ చేసి అభిమానులకు, కార్యకర్తలకు పంచడం జరిగింది, ఏఐటీయూసీ ఆటో కార్మికుల సమక్షంలో డొక్కా సీతమ్మ చలివేంద్రంను ఏర్పాటు చేయడం జరిగింది, ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి సంజయ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించిన దగ్గర నుండి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు అన్నారు, కానీ ఆఖరికి తాను అనుకున్న దాన్ని సాధించారాని, 2024 ఎన్నికల్లో వందకు వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించి చరిత్ర సృష్టించారని గుర్తు చేశారు, మనం కూడా ఇదే విధంగా పాటు పడాలని పవన్ కళ్యాణ్ అడుగు జాడల్లో నడుస్తూ పార్టీ ని, రాష్ట్రాన్ని దేశం లోనే ప్రథమ స్థానానికి తీసుకు వెళ్లేలా కృషి చేయాలన్నారు, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్ర ప్రజల కష్టాలు అన్నీ మాయం అయ్యాయి అని, డిప్యూటీ సీఎం పదవి అంటే ఆభరణంగా కొంతమంది నాయకులు భావించేవారని కానీ పవన్కళ్యాణ్ దాన్ని భాద్యతగా, సేవగా పరిగణిస్తూ నిత్యం ప్రజలతో మమేకం అయ్యి వారి కష్ట సుఖాలు తెలుసు కుని తీరుస్తూ ముందుకు వెళ్తున్నారన్నారు,పార్టీ ఆవిర్భవించి 13 సంవత్సరాలు అయిన సందర్భంగా వేలేరుపాడులోనే మొదటి జనసేన స్తూపాన్ని ఆవిష్కరించడం చాలా ఆనందానిచ్చిందన్నారు, ఈ కార్యక్రమం లో జనసేన నాయకులు బద్దుల , శివరామ్ ప్రసాద్, భాను, వంశీ, చంటి, వెంకటేశ్వర్లు, వీరాస్వామి, సాయి, కిరణ్, వెంకన్న, వినోద్, శంకర్, గణేష్,ఏఐటీయూసీ, సీఐటీయూసీ ఆటో యూనియన్ ప్రెసిడెంట్లు కే, శ్రీను, రమేష్, నరేష్, జనసైనికులు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *