మైనార్టీ గురుకులం జూనియర్ కళాశాల, సుశీల జూనియర్ కళాశాల పరీక్ష సెంటర్ల నందు కరపత్రాల పంపిణీ కార్యక్రమము.

జనం న్యూస్ మార్చి 15 మధిర టౌన్ ప్రతినిధి నండ్రు సుందర్ రావు 2026 -27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మధిర అధ్యాపక బృందము కరపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం రవీంద్రారెడ్డి సూచనలను అనుసరించి కళాశాల అధ్యాపక బృందం వైస్ ప్రిన్సిపాల్ జి.అరుణ నేతృత్వంలో బృందాలుగా వివిధ ఇంటర్మీడియట్ పరీక్ష సెంటర్లను సందర్శించారు.. మైనారిటీ జూనియర్ కళాశాల, మధిర మరియు సుశీల జూనియర్ కళాశాల, మధిర పరీక్ష సెంటర్ల నందు విద్యార్థులను కలిశారు. ఈరోజు ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు చివరి పరీక్ష రోజు కావడంతో విద్యార్థులకు కరపత్రాలను మరొకమారు ఇచ్చి ఉజ్వలమైన భవిష్యత్తుకు ఆనందకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అభ్యసించాలంటే ప్రభుత్వ డిగ్రీ కళాశాల మధిర నందే చేరాలని విజ్ఞప్తి చేశారు. కళాశాల పూర్వ విద్యార్థులు సాధించిన ప్రగతిని, కళాశాలలో జరుగుతున్న అభివృద్ధిని విద్యార్థులకు తెలియజేశారు. అంతేకాకుండా కొంతమంది ఇంటర్ సెకండియర్ విద్యార్థులను కళాశాలకు ఆహ్వానించి ఇక్కడ ఉన్న సౌకర్యాలను తరగతి గదులను ప్రత్యక్షంగా పరిశీలింప చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ జి.అరుణ, దోస్త్ కోఆర్డినేటర్ డా. ఎస్.ఇందిర, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డా. పి. సుజాత, పి. లక్ష్మీనారాయణ, షేక్ ఇమ్రాన్, పి శ్రీనివాస్, డా. కే. రామకృష్ణ డా.వి నాగరాజు, .వెంకటేష్, ఎస్. జ్యోతి, పి.మాధురి, ఎం.హారిక పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *