పేదల వైద్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ

జనం న్యూస్ , 15 మార్చి , ఇల్లంతకుంట: నిరుపేదల ఆరోగ్యానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల్లో ఆయన విస్తృతంగా పర్యటించి, అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పెద్ద లింగాపూర్‌లో ఉచిత వైద్య శిబిరం ప్రారంభం పెద్ద లింగాపూర్ గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన వైద్య రంగాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాడిలో పెడుతుందన్నారు ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించడమే కాకుండా, అవసరమైన మందులన్నీ అందుబాటులో ఉంచుతున్నాం. ఖాళీగా ఉన్న డాక్టర్లు, ఇతర సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తూ వైద్య సేవలను ప్రజలకు చేరువ చేస్తున్నాం. మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి వైద్య శిబిరాలను మరింత విస్తరిస్తామన్నారు అనంతరం వల్లంపట్ల మరియు జవహరిపేట గ్రామాల్లో నూతనంగా నిర్మించతలపెట్టిన అంగన్‌వాడీ కేంద్ర భవనాలకు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్నారుల పౌష్టికాహారం మరియు ప్రాథమిక విద్య కోసం అత్యాధునిక సౌకర్యాలతో ఈ భవనాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మండల వైద్యాధికారి డాక్టర్ జీవన, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, సర్పంచులు జి.వసంత-నర్సయ్య, నేరేళ్ల విజయ్ గౌడ్, కాంపెల్లి నాగరాజు పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఊట్కూరి వెంకట రమణారెడ్డి, గుడిసె అయిలయ్య, ఐరెడ్డి మహేందర్ రెడ్డి, ఎల్గందుల ప్రసాద్, రాజేందర్ రెడ్డి, నవీన్ రెడ్డి, పసుల వెంకటి, మామిడి రాజు, కాత మల్లేశం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *