జనం న్యూస్ 15 మార్చ్26:-ఈ నెల 21, 22 తేదీలలో బాలానగర్ మండలం వాయిళ్ల గడ్డ తండాలో గల లంబాడీల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆలయంలో జరిగే సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జాతరకు జిల్లాలో గల లంబాడీలు అధికమొత్తంలో హాజరుకావాలని లంబాడీల దీక్ష గురువు శ్రీ భోజు మహారాజ్ పిలుపునిచ్చారు. నవాబుపేట మండలం కొల్లూరు గ్రామ పరిధిలో ఉన్న గిరిజన తండాలలో ప్రచారం చేస్తూ గిరిజన నాయకులతో కలసి శ్రీ సేవాలాల్ మహారాజ్ జాతర వాల్ పోస్టర్ ఆవిష్కరించారు.జాతర పూజ కార్యక్రమానికి అధిక మొత్తంలో హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర తండా ఉపసర్పంచ్ తావుర్య నాయక్, గిరిజన నాయకులు ఫుల్ సింగ్ నాయక్,మల్లేష్ నాయక్,మోతిలాల్ నాయక్,గోవింద్ నాయక్,లక్ష్మణ్ నాయక్, దుల్య నాయక్ లు పాల్గొన్నారు