వివేకానంద విద్యాపీఠ్ పాఠశాలలో విజయవంతంగా రోబో సైన్స్ కార్నివల్

జనం న్యూస్ మార్చి 15 మేడిపల్లి మండలం: వివేకానంద విద్యాపీఠ్ పాఠశాలలో రోబో సైన్స్ కార్నివాల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల చైర్మన్ ఉషా కొడూరి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సుధాకర్ కొడూరి మాట్లాడుతూ… రోబో సైన్స్ కార్నివాల్ అనేది విద్యార్థులలో సృజనాత్మకత విద్య మరియు రోబోటిక్స్ పట్ల ఆసక్తిని కలిగించడంతో పాటు రోబోటిక్స్ విద్యను కూడా అందించడం ద్వారా వారి సృజనాత్మకత, శాస్త్రీయ ఆలోచనా విధానం మరియు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని విద్యార్థులను ఎంతో ఉత్సాహపరిచారు. నర్సరీ నుండి 9వ తరగతి వరకు విద్యార్థులు రూపొందించిన రోబోటిక్స్ మరియు సైన్స్ ప్రాజెక్టులు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థుల ప్రతిభను చూసి తల్లిదండ్రులు మరియు సందర్శకులు ప్రశంసలు కురిపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *