ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఔషధ గుణాలు ఉన్న మొక్కలు నాటే కార్యక్రమం

జనం న్యూస్/ గంభీరావుపేట మార్చి 15 రాజన్న సిరిసిల్ల జిల్లాగంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న ప్రజాప్రాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా కాలేజీ యొక్క బొటానికల్ గార్డెన్లో ఔషధ గుణాలు మరియు స్థానికంగా పెరిగే మొక్కలను కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి విజయలక్ష్మి మేడం అధ్యాపక అధ్యాపకేతర బృందం ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు,విద్యార్థులు పాల్గొని ఉత్సాహంగా నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఔషద గుణాలు గల మొక్కలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని విద్యార్థులు వాటిని పెంచడంలో అభిరుచి ఏర్పరచుకొని ఆరోగ్యకర వాతావరణాన్ని సమాజంలో సృష్టించే విధంగా ఉండాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం ప్రభాకర్ ఎన్ ఎస్ ఎస్ పి ఓధర్మపురి ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ వై ఆంజనేయులు వెక్ కోఆర్డినేటర్ వాణి టాస్క్ కోఆర్డినేటర్ శ్రావణ్, ఆది విష్ణు,బిక్షమయ్య,శ్రీనివాస్ మనోహర్, సుచరణ్,తదితర అధ్యాపక, అధ్యాపకేతర బృందం విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *