
జనం న్యూస్ మార్చి 15 బనగానపల్లె జిల్లాలో ప్రముఖ శక్తి క్షేత్రమైన నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతి మహోత్సవాలకు బనగానపల్లె పట్టణ మంత్రివర్యులు శ్రీ బి.సి. జనార్దన్ రెడ్డి దంపతులకు మరియు బి.సి. రాజా రెడ్డి వారికి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి , ఆలయ డెవలప్మెంట్ కమిటీ ఛైర్మన్ పి.వి. కుమార్ రెడ్డి మరియు ఆలయ ఛైర్మన్ పి.వి.నాగార్జున రెడ్డి ఆహ్వానించారు. బనగానపల్లె మండలం నందవరం లో వెలసిన శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయం నందు ఉగాది పండుగ పురస్కరించుకొని ఈనెల 19 వ తేదీ నుండి 25 వ తేదీ వరకు అమ్మవారి రాయబారది, జ్యోతి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి శనివారం బి.సి. జనార్థన్ రెడ్డి ని కలిసి ఆహ్వాన పత్రికను అందజేసి ఉగాది ఉత్సవాలకు ఆహ్వానించడం జరిగినది. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ… అమ్మవారి జ్యోతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఉగాది ఉత్సవాలకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర తదితర సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలి వస్తారని వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని ఆలయంలో చలువ పందిళ్ళు, ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి అమ్మవారి దర్శనం త్వరగా అయ్యేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమం భాగంలో మంత్రివర్యులు భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉగాది బ్రహ్మోత్సవాలలో అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీర్వచనాలు పొందగలరని కోరారు.