జనం న్యూస్ 15 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులంబ గద్వాల్ జిల్లా విష్ణువర్ధన్ గౌడ్ శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారులతో కలిసి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో ఎలాంటి పొరపాట్లు లేకుండా మ్యాపింగ్ ప్రక్రియను సమగ్రంగా నిర్వహించాలని సూచించారు. సూపర్వైజర్లు, ఏఈఆర్ఓలు నిరంతరం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.ఒకే వ్యక్తి పేరుతో రెండు చోట్ల ఓటు ఉండకుండా ఓటర్ల జాబితాను జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. రాజకీయ పార్టీల ద్వారా బూత్ లెవల్ ఏజెంట్లను నియమించాలన్నారు.అన్ని బూత్ లెవల్ అధికారులకు ఐడీ కార్డులు తప్పనిసరిగా ఉండాలని సూచించారు.అదేవిధంగా మరణించిన ఓటర్ల వివరాలు, పెండింగ్లో ఉన్న ఫార్మ్స్, డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీస్ పై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. జోగులాంబ గద్వాల ఐడిఓసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి సంబంధిత శాఖల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ, జోగులాంబ గద్వాల జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పూర్తి చేస్తామని తెలిపారు.అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియలో మంచి పురోగతి సాధిస్తున్నామని, ఇదే విధంగా కొనసాగిస్తూ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని అధికారులకు ఆదేశించారు.డీఎస్ఈ (డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీస్) పెండింగ్లో ఉన్న వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. జిల్లాలో మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సూపర్వైజర్లు,బీఎల్ఓలు అంకితభావంతో పనిచేయాలని, సంబంధిత మండలాల అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ,ఆర్డీఓ శ్రీనివాస రావు,తహసిల్దార్ హరికృష్ణ,సి సెక్షన్ సూపరిడెంట్ మంజుల, ఎన్నికల విభాగం అధికారి సురేష్,తదితరులు పాల్గొన్నారు. ..జారీ చేయువారు డిపిఆర్ఓ/ జోగులాంబ గద్వాల జిల్లా.