చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మార్చి 23,24,25 తేదీలలో ఇందిరా పార్కు హైదరాబాద్ లో జరిగే రిలే నిరాహార దీక్షలను జయప్రదం చేయండి.

చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు వనం శాంతి కుమార్.

జనం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా. 15/03/2026 మార్చి 23,24,25 తేదీలలో జరిగే నిరాహార దీక్షల కరపత్రం వనం శాంతి కుమార్ విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నేతన్న భరోసా పథకం అమలు చేస్తామని ప్రకటించి రెండు సంవత్సరాల అయ్యిందనీ త్రిఫ్ట్ పథకంలో చేనేత కార్మికుడు బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నా ప్రభుత్వం మాత్రం రెండు నెలలు మాత్రమే డిపాజిట్ చేసి మిన్నకుండిపోయిందని జియో టాగ్ ఉన్న చేనేత కార్మికుడు మరణిస్తే నేతన్న భీమా ద్వారా 5 లక్షలు ఇస్తున్నారు కానీ చనిపోయి ఏడాదిన్నర అయినా నేటి వరకు నేతన్న భీమా జమ కాలేదన్నారు. చేనేత కార్మికులు పోరాటం చేస్తేనే నేత కార్మికుల ఋణమాఫీ నేడు అమలు అవుతున్నదని మున్సిపల్ ఎన్నికల ముందు కేవలం మున్సిపల్ పరిధిలో మాత్రమే రుణమాఫీ చేసి మిగతా గ్రామీణ మండల ప్రాంతాల్లో ఉంటున్న చేనేత కార్మికులకు రుణమాఫీ చేయలేదని తక్షణమే అందరికి రుణమాఫీ చేయాలని అన్నారు. చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ ఋణమాఫీ చేసి చేనేత సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహించాలని సహకార సంఘాలకు ఋణమాఫీ చేయనందుకు మరియు ఎన్నికలు నిర్వహించనందుకు సహకార వ్యవస్థ కుంచించుకుపోయి సంఘాలకు తాళాలు పడుతున్నాయన్నారు. దిని వలన చేనేత కార్మికులు ఉపాధి కోల్పోయి వీధిన పడుతున్నారని తక్షణమే ఎన్నికలు నిర్వహించాలన్నారు. 2026-27 రాష్ట్ర బడ్జెట్ లో 2000 కోట్లు చేనేతకు 2000 కోట్లు టెక్స్ టైల్ కు కేటాంచాలని చేనేత చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ చేసే రిలే నిరాహార దీక్షలో అధిక సంఖ్యలో పాల్గొని విజవంతం చేయాలని కోరారు ఈ కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీ ధర్, కార్యదర్శి ముషం నరహరి సహారా ఎస్టేట్ పద్మశాలి సంఘం అధ్యక్షులు పెంటయ్య,సహారా ఎస్టేట్ సంక్షేమ సంఘం కోశాధికారి శేఖరయ్య చేనేత నాయకులు రాపోలు విశ్వ నాథం, ఏ.మమత జైపాల్,వై వెంకటేశ్వర్లు,గజం శ్రీశైలం,సి హెచ్ రవికుమార్,దుస్స కుమార్,కె రాములు,గంజి మురళీ ధర్,ముషం నరహరి తెలంగాణ చేనేత కార్మిక సంఘంనాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *