పగడ్బందీగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం

నిర్మల్ డీఈవో దర్శనం భోజన్న

జనం న్యూస్ మార్చ్ 15 (నిర్మల్ జిల్లా స్టాపర్) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుండి 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం అవుతున్నాయని ఆ పరీక్షలకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న తెలిపారు ఈ సందర్భంగా డిఇఓ మాట్లాడుతూ గతంలో ఎన్నటి లేని విధంగా ఈసారి దీర్ఘకాలం పాటు పరీక్షలు నిర్వహించి మెరుగైన ఫలితాలను రాబట్టేందుకు విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసిందని తెలిపారు ఈ సంవత్సరము 10వ తరగతి పరీక్షలు ఒక్కొక్క పరీక్షకు మధ్య రెండు మూడు రోజుల సమయం ఉన్నదని ఈ యొక్క సమయాన్ని ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు ఉత్తీర్ణత శాతం పెరగాలని పరీక్షకు సిద్ధం అయ్యేందుకు అవకాశం ఉంటుంది నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 47 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి నిర్మల్ జిల్లాలో మొత్తం బాలురు 4,786 మంది బాలికలు 4964 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యాశాఖ ఆయా పాఠశాలల యజమాన్యాలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు ఎండాకాలం నేపథ్యంలో గాలి వెళ్తురు.తో పాటు విద్యుత్ సౌకర్యాలను ఏర్పాటు చేశారు విద్యార్థులకు దాహం తీర్చేందుకు మంచినీటి వసతి తో పాటు మూత్రశాలలను శుభ్రపరిచారు. 10వ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి ఆవంచనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ సిబ్బంది చే భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని నిర్మల్ డీఈవో దర్శనం భోజన్న తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *