జనం న్యూస్ అనంతపురం మార్చ్ 15 రిపోర్టర్ ముంగా ప్రదీప్ అనంతపురం జిల్లా రెవెన్యూ కార్యాలయంలో అధికారిని కలిసి తాడిపత్రి మున్సిపాలిటీ అధికారులు గిరిజనులకు ప్రభుత్వం నిర్ణయించిన రిజర్వేషన్ను అమలు చేయకుండా అన్యాయం చేస్తున్నారని వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం జారీ చేసిన జి .ఓ .ఎంస్ .నెంబర్ ., మా , తేదీ 02-04-1993 ప్రకారం గిరిజనులకు 6 శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉన్నప్పటికీ, తాడిపత్రి మున్సిపాలిటీ అధికారులు దీనిని పట్టించుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై తక్షణ విచారణ జరిపి గిరిజనులకు న్యాయం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారిని కోరినట్లు తెలిపారు. రిజర్వేషన్ అమలు చేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు హైకోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు. ఈ సందర్భంగా మాజీ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సాకే చిరంజీవి పాల్గొన్నారు.