వెలుగొండ గ్రామంలో చత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటుకు మేము వ్యతిరేకం కాదు అని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఈర్ల చంద్రమౌళి

జనం న్యూస్ మర్చి 15 ప్రతి నిది ఎండీ జహంగీర్ నగర్ కర్నూల్ జిల్లా బిజీనాపల్లి మండలం వెలుగొండ గ్రామంలో కొందరు వ్యక్తులు చత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటుకు గ్రామ చౌరస్తాలో దిమ్మె నిర్మాణానికి పూనుకున్నారు ప్రస్తుతం వారు అక్కడ విగ్రహ ఏర్పాటు చేసే దిమ్మె నిర్మాణానికి స్థలము విషయంలో మేము అక్కడ గతంలో బస్టాండు నిర్మాణం చేయడానికి గ్రామపంచాయతీ తీర్మానం కూడా చేయబడినది వాటిని లెక్కకు తీసుకోకుండా ప్రస్తుతం కొంతమంది చాలా పెద్దగా అక్కడ పిల్లర్లు నిర్మాణం చేయుటకు గుంతలు తవ్వి ఉన్నారు వాటిపై అభ్యంతరం తెలిపి ఇంకొక చోట అందరము సమిష్టిగా చత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకునేందుకు మా వంతు పూర్తి సహకరిస్తాం అంతేగాని మేము విగ్రహం ఏర్పాటుకు వ్యతిరేకమని మాపై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు ఇది వాస్తవం కాదు ఇటువంటి దుష్ప్రచారాన్ని మేము ఖండిస్తున్నాం అని ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *