జనం న్యూస్ మర్చి 15 ప్రతి నిది ఎండీ జహంగీర్ శ్రీ విశ్వవసు సంవత్సరం ఫాల్గుణ మాసం కృష్ణ పక్షం ఏకాదశి శనివారంనాడు బీజినేపల్లి మండలం పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలో గల శ్రీశనేశ్వర స్వామికి భక్తులచే శని గ్రహ దోష నివారణకు స్వామి వారికి తిలతైలా అభిషేకలు భక్తితో వేదమంత్రచరణల మధ్య జరిగాయి. శ్రీసార్థాసప్త జేష్టమాత సమేత శనేశ్వర స్వామికి శనివారం ఏకాదశి నాడు ప్రత్యేకంగా తిలతైల అభిషేకాల పూజలు నిర్వహించారు.ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ ఈ మాసంలో స్వామివారిని కొలిచిన అత్యధిక సంతృప్తి పొంది విశేష ఫలితాన్ని భక్తులకు ఇస్తారని ఆయన అన్నారు.ప్రతి ఒక్కరు జన్మ రిత్యా,గోచార రీత్యా శనిగ్రహ దోష నివారణకు స్వామివారిని శక్తిమేరకు పూజించాలని అన్నారు. ఈ ఆలయంలో గోన బుద్ధారెడ్డి కాలంనాటి బ్రహ్మసూత్రం గల పరమశివునికి భక్తులచే రుద్రాభిషేక పూజలు, అర్చనలు,దీపారాధన నందీశ్వర స్వామి వారికి ప్రత్యేక అర్చనపూజలు భక్తులచేనిర్వహించారు.అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు.ఈకార్యక్రమం లో ఆలయ ఆలయ చైర్మన్ వెల్దండ గోపాల్ రావు, గ్రామ సర్పంచ్ టి.సుగుణమ్మ, కమిటీ సభ్యులు కెంచె రాజేష్, ప్రభాకరచారి,పుల్లయ్య, అడ్వకేట్ వీర శేఖర్ చారి, శ్రీకాంత్ రెడ్డి,ఆలయ ఆర్చకులు శాంతి కుమార్, ఉమమహేశ్వర్, సిబ్బంది గోపాల్ రెడ్డి భక్తులు, మహిళలు పాల్గొన్నారు.