మరెడ్డిపల్లి ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి భక్తుల విరాళాలు

జనం న్యూస్ మార్చి 15 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) గోరంట్ల మండలం పులేరుగ్రామపంచాయతీ పరిధిలోని మరెడ్డిపల్లెలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ ఆంజనేయస్వామి దేవాలయ నిర్మాణానికి భక్తులు ఉదారంగా విరాళాలు అందజేశారు. ఆలయ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఈడిగ ప్రసాద్ వారి కుటుంబ సభ్యులు రూ.1,50,116 (ఒక లక్ష యాభై వేల నూట పదహారు రూపాయలు) విరాళంగా సమర్పించారు. అలాగే బోయ గంగరాజు వారి కుటుంబ సభ్యులు రూ.60,116 (అరభై వేల నూట పదహారు రూపాయలు) ఆలయ నిర్మాణానికి అందజేశారు. ఈ సందర్భంగా దాతల సేవాభావాన్ని గ్రామస్తులు ప్రశంసించారు. ఆలయ నిర్మాణం త్వరగా పూర్తి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రతాప్ సింగ్, ఉపసర్పంచ్ శ్రీనివాసులు, ఈడిగ రంగప్ప, బోయ ఆదినారాయణప్ప, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *