కారు ఢీకొనడంతో ఇద్దరికి గాయాలు

జనం న్యూస్ , మార్చి 15, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ జమ్మికుంట మండల పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలైన ఘటన శనివారం చోటుచేసుకుంది. పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి చెందిన పోల్సాని సంపత్‌రావు తండ్రి స్వామిరావు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కుమారుడు పోల్సాని తిరుపతిరావు తన ద్విచక్ర వాహనం (ఏపీ 16 అర్ 4419) పై ఇంటి నుండి బయలుదేరి జగ్గయ్యపల్లి గ్రామంలో ఉన్న తన అత్తమ్మ పొనగంటి రాధను ఎక్కించుకొని తిరిగి వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి వస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం సుమారు 3:30 గంటల సమయంలో కోరపల్లి గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తా సమీపానికి చేరుకునే సరికి బిజిగిరి షరీఫ్ వైపు నుండి వస్తున్న కారు (ఏపీ 36 ఏ హెచ్ 2691) మేక వీరయ్య (హిమ్మత్‌నగర్ గ్రామం, వీణవంక మండలం) నిర్లక్ష్యంగా నడిపి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో తిరుపతిరావుకు కుడి చేతికి మరియు శరీరంలోని ఇతర భాగాలకు గాయాలు కాగా, రాధకు తల ముందు భాగంలో గాయాలైనట్లు సమాచారం. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీఐ రామకృష్ణ గౌడ్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *