జనం న్యూస్, మార్చ్ 15, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ రాష్ట్రంలో ఇంటి పన్ను వసూళ్లలో వరుసగా రెండు పర్యాయాలు పూర్తి చేసి జమ్మికుంట మున్సిపాలిటీ అరుదైన రికార్డు సృష్టించిందని మున్సిపల్ చైర్మెన్ మొలుగు ప్రశాంత్ కుమార్ తెలిపారు. శనివారం జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందిని ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా చైర్మెన్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంలో ఇంటి పన్ను వసూళ్లు పూర్తి చేసినట్లు తెలిపారు. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వసూళ్లను మార్చి 31 గడువు ముగిసేలోపే ఈ నెల 13న పూర్తిచేయడం గర్వకారణమని అన్నారు. మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ నాయకత్వంలో ఇంటి పన్ను వసూళ్లలో సిబ్బంది సమన్వయంతో పని చేసి ఈ విజయాన్ని సాధించారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ మేనేజర్ జి. రాజిరెడ్డి, ఆర్.ఐ భాస్కర్, సూపర్‌వైజర్లు వికాస్, రాజశేఖర్ రెడ్డి, శ్రీధర్, రాజ్‌కుమార్, దీపిక, వాణి, శ్రీనివాస్, సానిటరీ ఇన్‌స్పెక్టర్ పి. మహేష్, బి. సదానందం, వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బందికి చైర్మెన్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
