హుజురాబాద్ ప్రాంతానికి డంపింగ్ యార్డ్ వద్దు – ప్రజా సంఘాల విజ్ఞప్తి

జనం న్యూస్ , మార్చి 14, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ హుజురాబాద్ సమీపంలోని కొత్తపల్లి–సిర్సపల్లి ప్రాంతంలో ప్రతిపాదితంగా ఏర్పాటు చేయనున్న డంపింగ్ యార్డ్‌ను తక్షణమే రద్దు చేయాలని హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్ రొంటాల సుహాసిని కు ప్రజా సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై మున్సిపాలిటీ పాలకమండలి ప్రత్యేక సమావేశం నిర్వహించి డంపింగ్ యార్డ్‌ను రద్దు చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేయాలని వారు కోరారు.హనుమకొండ జిల్లా మడికొండలో ఏర్పాటు చేయాలని భావించిన డంపింగ్ యార్డ్‌కు అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేయడంతో, దాన్ని హుజురాబాద్ సమీపంలో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వం ముందుకు తెచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో టెండర్లకు ఆహ్వానం పలికే చర్యలు జరుగుతున్నట్లు సమాచారం ఉందన్నారు.డంపింగ్ యార్డ్ ఏర్పాటుతో హుజురాబాద్ చుట్టుపక్కల గ్రామాలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. వ్యవసాయ భూములు దెబ్బతినే అవకాశం ఉండటంతో పాటు కాలుష్యం పెరిగి ప్రజల్లో వివిధ రకాల రోగాలు వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. దీని వల్ల ప్రాంతం ఎడారిలా మారే ప్రమాదం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.అందువల్ల మున్సిపల్ పాలకమండలి ఈ డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పల్కల ఈశ్వర్ రెడ్డి, వేల్పుల రత్నం, గూడూరు స్వామిరెడ్డి, మచ్చ సమిరెడ్డి, తునికి సమ్మయ్య, మట్టెడ ప్రకాష్, సహదేవ్, భద్రయ్య, బిక్షపతి, సతీష్, స్వామి, వేల్పుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *