ఉగాది వేడుకలకు పోచమ్మ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు – కొత్త కమిటీ ప్రచారాన్ని ఖండించిన పాలకవర్గం

జనం న్యూస్, మార్చి 14, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్: ఉగాది పండుగ సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని పోచమ్మ దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఆలయ పాలకవర్గం తెలిపింది. ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా భారీగా భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు ఆలయానికి తరలివస్తుండటంతో ఆలయాన్ని శుభ్రపరిచి సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించింది. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తుల కోసం ప్రత్యేక పందిళ్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది.పట్టణంలోని 15కు పైగా కుల సంఘాల ప్రతినిధులతో ఏర్పడిన కమిటీ ఇప్పటివరకు ప్రభుత్వం ద్వారా సుమారు రూ.20 లక్షల నిధులు సమకూర్చుకుని ఆలయంలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపింది. పోచమ్మ దేవాలయానికి కొత్త కమిటీ ఏర్పాటైందని కొందరు ప్రకటించుకోవడాన్ని కమిటీ ఖండించింది. పట్టణంలోని అన్ని కుల సంఘాలు కలిసి సమావేశమై అధికారికంగా కొత్త కమిటీని నియమించే వరకు ప్రస్తుత కమిటీ ఆధ్వర్యంలోనే ఆలయ కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. పాలకవర్గం వివరాలు: గౌరవ అధ్యక్షుడు – కొలిపాక రమేష్ (చిన్న) చైర్మన్ – భూమ్ సాయి కృష్ణ (చంటి)వైస్ చైర్మన్ – నడిగొట్టు రమేష్..డైరెక్టర్లు: అపరాధ రాములు, గాలిబ్ రాములు, సొల్లు మోహన్ రాజ్, తొర్రి అశోక్, పంజాల శ్రీనివాస్, పప్పు రాదమ్మ, గోస్కుల లక్ష్మీ, గోస్కుల మల్లమ్మ, మోతె రవి, బోరగాల సురేష్ గా వారు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *