జనం న్యూస్, మార్చ్ 14 ,కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ జమ్మికుంట మున్సిపాలిటీ 22వ వార్డులోని అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 22వ వార్డు కౌన్సిలర్ మంద రాధ చిన్నారులకు అన్నప్రాసన చేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 8వ వార్డు కౌన్సిలర్ కొలుగూరి సురేష్ హాజరై చిన్నారులకు ఆశీస్సులు అందించారు. చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ గుల్లి స్వరూప, టీఆర్ఎస్ పార్టీ 22వ వార్డు అధ్యక్షుడు మంద రాజేష్, ఆర్పీ ఉమా, హెల్త్ డిపార్ట్మెంట్కు చెందిన మంజుల, ఆశా వర్కర్ వడ్లూరు రమతో పాటు చిన్నారుల తల్లులు మరియు 22వ వార్డు ప్రజలు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల ఆరోగ్యం, పోషణ కోసం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని స్థానికులు తెలిపారు.