పేకాట ఆడుతున్న ఆరుగురి పై కేసు నమోదు,

* రూ.57,830నగదు, 3 ఫోన్లు స్వాధీనం * మెదక్ జిల్లా ఎస్పీ. డి. వి. శ్రీనివాస రావు

జనం న్యూస్ 2026 మార్చి14( మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్) చేగుంట మండలం బోనాల గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి రూ.57,830 నగదు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మడుగుల అరుణ్, కేదారి చంద్రం, చిట్టం వెంకటేష్, పరా ప్రవీణ్, గోపాటి పెంటయ్య, మచ్చు శ్రీకాంత్‌లను పట్టుకున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ దాడి నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఘటనపై చేగుంట పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ,జిల్లాలో చట్టవ్యతిరేకకార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పేకాట, బెట్టింగ్ వంటి అక్రమ చర్యల వల్ల అనేక కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని తెలిపారు. ముఖ్యంగా యువత ఇలాంటి చెడు మార్గాలకు దూరంగా ఉండాలని సూచించారు. అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే డయల్ 100కు తెలియజేయాలని ప్రజలను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *