పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు : ఎంఈఓ వెంకటేశ్వర్లు

జనం న్యూస్ మునగాల మండలం మార్చి 14 – కందిబండ హరీష్. నేటి నుంచి జరగబోయే 10 వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈఓ వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.మండల వ్యాప్తంగా 349 మంది విద్యార్థిని విద్యార్థులు పది పరీక్షలకు హాజరుకానున్నారు.మండల కేంద్రంలో ఉన్న స్థానిక జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 19 మంది,(టి ఎస్ ఎం ఎస్) తెలంగాణ ఆదర్శ పాఠశాల పాఠశాలలో 240 మంది విద్యార్థులకు జరుగు తెలుగు పరీక్షల పర్యవేక్షణ కు ఇద్దరూ చీఫ్ సూపర్డెంట్లు,మరో ఇద్దరూ డి ఓ అధికారులు, 19 మంది యూనిస్ లెటర్స్ తో విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. పరీక్ష కేంద్రానికి ఒక గంట ముందు హాల్ టికెట్ తో విద్యార్థినీ విద్యార్థులు హాజరుకావాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *