ఘనంగా కవయిత్రి మొల్ల జయంతి.

* వెలలేని కవిత్వానికి చిరునామా కవయిత్రి మొల్ల షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. * షాద్ నగర్ కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో కవయిత్రి మొల్ల జయంతి వేడుకలు.

జనం న్యూస్ 14 మార్చ్ 2026, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ మొహమ్మద్ సమి : షాద్ నగర్ కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో కవయిత్రి మొల్ల జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని మండల పరిషత్ ఆవరణలో ఆమె విగ్రహానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పూలమాల వేసిన అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తొలి తెలుగు కవయిత్రి గా వెళ్లలేని విలువైన కవిత్వాన్ని తెలుగు ప్రజలకు అందించిన మహా కవయిత్రి మొల్ల అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రశంసించారు. తెలుగు కవయిత్రులలో తొలితరం కవయిత్రిగా పేరు మోసిన ఆమె రామాయణాన్ని వేద భాషల్లో రచించారని, వాల్మీకి మహర్షి రచించిన రామాయణాన్ని తనదైన శైలిలో సామాన్యులకు సైతం అర్థమయ్యే తెలుగు భాషలో అందించడం గర్వించదగిన విషయమని పేర్కొన్నారు. ఎందరో మహా రచయిత్రులు మన తెలుగు తేజాలు వెలగడానికి ఆమె స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. తెలుగువారు ఉన్నంతకాలం, తెలుగు సాహిత్యం వెలుగులు పంచినంత కాలం ఆమె మన హృదయాల్లో ఉంటారని ప్రశంసించారు. ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. షాద్ నగర్ కుమ్మరి సంఘం అధ్యక్షులు నడికూడ శ్రీశైలం మరియు ప్రధాన కార్యదర్శి రాయికల్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగనూరి బస్వం, మరియు కుమ్మరి సంఘం ఉపాధ్యక్షులు శ్రీశైలం, గ్రంథాలయం డైరెక్టర్ చంద్రశేఖర్ సాయిలు, పెంజర్ల రమేష్, వైన్స్ అంజయ్య, దూసకల్ రమేష్, బ్రహ్మయ్య, నరసింహ, వెంకటేష్, బాలరాజ్, కృష్ణ, ఆటో శ్రీను, రాపోల్ వెంకటేష్, కృష్ణయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *