మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు భౌతిక కాయానికి నివాళ్లు అర్పించిన

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి

జనం న్యూస్ మార్చ్ 14 రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలు మరో పుచ్చలపల్లి సుందరయ్యను కోల్పోయారు. ఇబ్రహీంపట్నం లొ పేదరిక నిర్ములన పై కొండిగారి రాములు పోరాటం మరువలేనిది కొండిగారి రాములు పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను. ప్రభుత్వ లంచానళనతో అంత్యక్రియలు చేయాలనీ ప్రభుత్వం మాట్లాడాను.. కానీ కొన్ని అడ్డంకులు వస్తున్నాయి అందుకే కొండి రాములు అంత్యక్రియలు నా సొంత నిధులతో చేస్తాను రంగన్న కుటుంబం పై ఎలాంటి భారం పడకుండా అంత్యక్రియల కార్యక్రమం ఖర్చు నేనే బరిస్తా ఎమ్మెల్యే రంగన్న అసెంబ్లీ లొ ఆయనతో ఉన్నా అనుబంధాన్ని గుర్తుచేసుకుని ఎమ్మెల్యే బాధపడ్డారు ఇబ్రహీంపట్నం మాజీ శాసనసభ్యులు కొండిగారి రాములు మరణవార్త తనని తీవ్రంగా కలిసివేసిందని అన్నారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి.రాజకీయాల్లో మచ్చ లేని నాయకుడు కొండిగారి రాములు అని అన్నారు.స్వార్థం కోసం అధికార దాహంతో ఎ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లే ఎమ్మెల్యే ఉన్నా ఈ కాలంలో నమ్ముకున్న సిద్ధంతం కోసం ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని నిలిచినా వ్యక్తి కొండిగారి రాములు అని అన్నారు. కొండిగారి రాములు కుటుంబానికి తాను ఎల్లేవేళల అండ గా ఉంటానని ఈ కష్టం వచ్చిన తన దగ్గరకు రావాలని వారి కుటుంభ సభ్యులకు ఆయన దైర్యం చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *