జనం న్యూస్ మార్చి 14(రిపోర్టర్ నల్లబోతుల రాజు)అనంతపురం జిల్లా వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం(స్వస్తి )బృందం తనిఖీ చేశారు.గ్రామాల నుండి వచ్చే రోగులకు హాస్పిటల్లో అందించే వైద్య సేవలను గురించి వైద్యాధికారి డాక్టర్ సర్దార్ వలి ని అడిగి తెలుసుకున్నారు,ఎల్సెవియర్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇలాన్ షేమ్, శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్,డాక్టర్ తన్మయి,డాక్టర్ శ్యామ,మేనేజర్ వేదిక అసోసియేట్ మేనేజర్,జిల్లా కోఆర్డినేటర్ విజయ్ కుమార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేసి పలు వార్డులను పరిశీలించారు.అనంతరం వారు మాట్లాడుతూ వాతావరణ సంబంధిత ఆరోగ్య అవసరాలను తెలుసుకోవాలని కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు తెలియజేశారు.వాతావరణం మార్పుల వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యల పట్ల అవగాహన పెంపొందించుకోవాలన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని సిబ్బందితో గ్రామంలో ప్రజల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకున్నారు.ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి క్షేత్రస్థాయిలో గడపగడపకు వెళ్లి సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.ఏఎన్ఎంలు పలు అంశాలపై స్వస్తి టీం ను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మోనాలిసా,సిహెచ్ఓ లక్ష్మిదేవి, ఎంపిహెచ్ఈఓ గురు ప్రసాద్,హెల్త్ ఎడ్యుకేటర్ సత్యనారాయణ,హెల్త్ అసిస్టెంట్లు నాగరాజు,సంపత్ కుమార్,ఎం.ఎల్.హెచ్.పి భారతి, ఏఎన్ఎంలు లక్ష్మీ,జ్యోతి,రాజేశ్వరి,స్టాఫ్ నర్స్ సుజాత,ఫార్మ్ సిస్ట్ రామచంద్ర,ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.