జనం న్యూస్ మార్చి 14 ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ మరియు గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు శుక్రవారం ప్యాడ్లు,పెన్నులు,స్కేలు పంపిణీ చేయడం జరిగింది. టిడిపి మండల అధ్యక్షుడు అమరవరపు అశోక్ మాట్లాడుతూ విద్యార్థులందరూ పరీక్షలు బాగా రాసి మంచి ఉత్తీర్ణత సాధించి మీ తల్లిదండ్రులకు మన మండలానికి మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యావ్యవస్థలో అనేక మార్పులు తెచ్చిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలలో అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలని విద్యార్థులకు మంచి బోధనలు అందించే విధంగా పాఠశాలల్లో అనేక ఏర్పాట్లను చేశారని గతేడాది కంటే ఈ ఏడాది రాష్ట్రంలో ఉత్తీర్ణత శాతం బాగా పెంచే విధంగా అన్ని చర్యలు తీసుకున్నారని వారన్నారు అలానే విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ బెతి శ్రీను, శాఖమూరి సంజీవులు, కరటూరి రాధాకృష్ణ, కొమ్మన వెంకటేశ్వరరావు, కురుమేళ్ళ సుధాకర్, బడిగంటల వెంకటేశ్వరరావు, కోటిపల్లి ముత్యాలరావు, కుకునూరు సత్తిబాబు రాంబాబు, అనిల్ పోసి సలీం సీతారాములు పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.