జనం న్యూస్ మార్చి 14 రావికమతం విలేఖరి గుమ్మడి వెంకటేశ్వరరావు మండలంలో కొత్తకోట గ్రామంలో వేంచేసి యున్న శ్రీ శ్రీ శ్రీ అభయ ఆంజనేయ స్వామి 32వ వార్షికోత్సవ వేడుకలు, తీర్ధ మహోత్సవం శుక్రవారం ప్రారంభమయ్యాయి.ప్రతి ఏడాది మూడు రోజులపాటు ఈ వార్షికోత్సవ వేడుకలు శుక్ర, శని, అది వారాలలో నిర్వహిస్థారు.ఈ మూడు రోజులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు.ఈ మూడు రోజులు ఉదయం నుంచే స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహిస్తారు. మొదటి రోజు శుక్రవారం గ్రామానికి చెందిన పచ్చి గోళ్ళసంతోసి, నందిని దంపతులు స్వామివారికి అన్ని రకాల ప్రసాదాలు, పూలమాలలు వేసి మొదటి పూజ నిర్వహించారు. స్వామివారిని సర్పంచ్ కోన లోవరాజు , ఉప సర్పంచ్ పందలదేవా, కూటమి నాయకులు కోట సత్యనారాయణ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.