జనం న్యూస్ మధిర, మార్చి 14, దోర్నాల కృష్ణ మధిర మండల విద్యాశాఖ అధికారిగా సుదీర్ఘకాలం పాటు పనిచేసి గత నెల 28న రిటైర్డ్ అయిన వై ప్రభాకర్ వారి స్థానంలో మధిర మండల మండల విద్యాశాఖ అధికారి ఇన్ చార్జి గా సిరిపురం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెన్నా మురళీమోహన్ రావు వారిని నియమిస్తూ విద్యాశాఖ అధికారులు నేడు ఉత్తర్వులు ఇవ్వడం తో వారు మధిర ఎమ్మార్సీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించడం జరిగింది. పిఆర్టియు మధిర మండల శాఖ ఆధ్వర్యంలో వారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశామని మధిర మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిలుకూరి సత్యనారాయణరెడ్డి పోలే సుధాకర్ పేర్కొన్నారు అపార అనుభవం కలిగిన మురళీమోహన్ రావు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వ విద్యా రంగ అభివృద్ధికి కృషి చేస్తారని ఆకాంక్షించారు. వారికి సంఘ పరంగా సంపూర్ణ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ఆర్ బ్రహ్మారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు రవికుమార్ రాష్ట్ర బాధ్యులు వెంకటేశ్వరరావుమదార్ నాయకులు కొలగాని ప్రసాదరావు పిల్లి నరసింహారావు జమీర్, తెల్ల మేకల శ్రీనివాసరావు, అజయ్ కుమార్ డి శ్యామలరావు చేడే సతీష్ సత్యనారాయణ రామ చంద్రా రెడ్డి లింగయ్య, రుద్ర పోగు శ్రీను మర్రి కృష్ణయ్య,కృష్ణా రెడ్డి,అరుణ శ్రీ, సునీత తదితరులు ఉన్నారు*