పరిశుభ్రతే ప్రధానం మున్సిపాలిటీలో ఏ సమస్య తలెత్తినా తనను నేరుగా సంప్రదించండి మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని సుజాత

జనం న్యూస్ మధిర మార్చి 14, దోర్నాల కృష్ణ మధిర మున్సిపాలిటీ పరిధిలో త్రాగునీటి సమస్య, పారిశుద్ధ్యంపై అధికారులు ప్రేత్యేక ద్రుష్టి సారించి శాశ్వత పరిస్కారం చూపాలని మధిర మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని సుజాత రామనాథం ఆదేశించారు.ప్రజాపాలన ప్రగతికి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మధిర మున్సిపాలిటీ ఇల్లందూల పాడులో మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ తో కలిసి చైర్మన్ విస్తృతంగా పర్యటించారు.ఈ సందర్భంగా డ్రైన్ వ్యవస్థను పరిశీలించారు.మున్సిపాలిటీ నాలుగో వార్డు ఇల్లందులపాడు వ్యాప్తంగా ఉన్న కాల్వలను శానిటేషన్ సిబ్బంది శుభ్రపరిచారు.అదే విధంగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించడంతో పాటు దోమల నివారణకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈసందర్భంగా చైర్మన్ సుజాత మాట్లాడుతూ,పరిశుభ్రతే ప్రధానంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మురుగు కాల్వల్లో నీరు నిల్వ ఉండకుండా కాల్వలను శుభ్రం చేయించడం ద్వారా దోమల బెడద తప్పుతుందని చెప్పారు.మున్సిపాలిటీ వ్యాప్తంగా పారిశుధ్య కార్యక్రమాలు అనునిత్యం నిర్వహిస్తూ మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, ఇందుకు అధికారులు సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పారు. మధిర మున్సిపాలిటీలో ఏ సమస్య తలెత్తినా ప్రజలు తనను నేరుగా సంప్రదించాలని, ఆ సమస్యను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి సూర్యదేవర కోటేశ్వరరావు, సామినేని రామనాథం, వాసిరెడ్డి నాగేశ్వరావు, కోట డేవిడ్, తాళ్లూరి రాధా కుమార్, బోడెపుడి గోపి, నండ్రు శ్రీనివాసరావు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *