గంగారం మండలంలో డిటిఎఫ్ సర్వసభ్య సమావేశం

జనం న్యూస్ గంగారం మండలం మహబూబాబాద్ జిల్లా 14-03-2026 మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని జీపీఎస్ రేపల్లెవాడ పాఠశాలలో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ మండల శాఖ సర్వసభ్య సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశానికి ముడిగే రామచందర్ అధ్యక్షత వహించారు. సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి మోకాళ్ల సమ్మయ్య వార్షిక నివేదికను ప్రవేశపెట్టగా, సభ్యులు చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశానికి ఎన్నికల అధికారిగా జిల్లా అధ్యక్షులు నెల్లుట్ల భాస్కర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే బడ్జెట్‌లో విద్యాశాఖకు 20 శాతం నిధులు కేటాయించాలని, పీఆర్‌సీ నివేదికను అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని కోరారు. అనంతరం డిటిఎఫ్ గంగారం మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ సభ్యులు: మండల అధ్యక్షులు – చాట్ల నాగేశ్వరరావు మండల ప్రధాన కార్యదర్శి – బానోత్ శ్రీనివాస్ ఉపాధ్యక్షులు – మోకాళ్ల సమ్మయ్య, సుజాత, ముడిగే సుధాకర్ కార్యదర్శులు – పులుసుం రమాదేవి, ముల్కం లక్ష్మీనర్సు, పిడబోయిన రజిత జిల్లా కౌన్సిలర్లు – సోలం నరసింహారావు, ముడిగే రామచందర్ ఆడిట్ కమిటీ కన్వీనర్ – ఈసం సారంగపాణి సభ్యులు – గుమ్మడి లక్ష్మయ్య, సోలం హిందూజ ఈ సమావేశంలో కొత్తగూడ మండల ప్రధాన కార్యదర్శి జాటోత్ జుమ్మేలాల్, కార్యదర్శి దుపటి సుధాకర్, సీనియర్ నాయకులు యాప బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *