హెచ్డిఎఫ్సి వారి ఆధ్వర్యంలో సంపూర్ణ గ్రామీణ అభివృద్ధి

జనం న్యూస్ మహబూబాబాద్ జిల్లా గంగారం కేంద్రంలోని రైతు వేదిక నందు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ పరివర్తన సి ఎస్ ఆర్ ఆధ్వర్యంలో సంపూర్ణ గ్రామీణాభివృద్ధి ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం మార్చి 13న నిర్వహించబడింది. ఈ ప్రాజెక్ట్‌ను ఎస్.ఎం. సెహగల్ ఫౌండేషన్ సహకారంతో అమలు చేస్తున్నారు గ్రామాలలోని మౌలిక మౌలిక వసతులను మెరుగుపరచడం కోసం గంగారం మండలం లోని అన్ని గ్రామాలలో పనిచేస్తున్నామని మాకు మీ సహాయ సహకారాలు అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్నమకాయ రెడ్డి జోనల్ హెడ్, తెలంగాణ, రాజేష్ అనెల్లీ క్లస్టర్ హెడ్, బి. లక్ష్మన్ బ్రాంచ్ మేనేజర్, డా. నాగివాణి సి డబ్ల్యూ సి చైర్మన్, డా. ప్రత్యూష, ఎన్. నీళిమ సిడిపిఓ, ఎం. కృష్ణ ఇన్‌చార్జ్ ఎంపీడీవో, స్నేహ అసిస్టెంట్ హైడ్రో జియాలజిస్ట్, ఎమ్మార్వో బాల కిషన్, ఎన్.పి. సింగ్ సీనియర్ ప్రాజెక్ట్ లీడ్, రామాదేవి ఎంఈఓ, డా. శ్రవణ్ కుమార్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్, పాల్గొన్నారు ముఖ్య అతిథిగా ఆసియా మేడమ్ హెచ్డిఎఫ్సి సిఎస్ఆర్ మేనేజర్ హాజరయ్యారు. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు మరియు ఎస్.ఎం. సెహగల్ ఫౌండేషన్ సిబ్బంది, మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు. అలాగే బావురుగొండ సర్పంచ్, జంగాలపల్లి సర్పంచ్, మర్రిగూడెం సర్పంచ్, తిరుమలగండి సర్పంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతినిధులు అయిన నవీన్ ప్రతాప్ సింగ్ (టీమ్ లీడ్), అఖిలేష్ శర్మ (ప్రాజెక్ట్ సూపర్వైజర్), మల్లికార్జున్ (సివిల్ ఎక్స్‌పర్ట్), ధనుంజయ్ (ప్రాజెక్ట్ కోఆర్డినేటర్) కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఫీల్డ్ సిబ్బంది డి. ఆకాశ్, యాకూబ్ అలీ, ఆర్. నవీన్, జె. కవిత, బి. కృష్ణ, బి. వెంకటేష్, యు. శివ, ఎన్. తేజస్వి, ఎస్. ప్రేమ్ కుమార్ కూడా హాజరయ్యారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా చెట్ల నాటకం, సోలార్ స్ట్రీట్ లైట్లు, నీటి సమర్థవంతమైన సాగు విధానాలు, రైతులకు శిక్షణలు, స్మార్ట్ స్కూల్స్ ఏర్పాటు, అంగన్‌వాడి కేంద్రాల పునరుద్ధరణ, జీవనోపాధి అభివృద్ధి వంటి పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *