జనం న్యూస్ మార్చి 14( మఠంపల్లి ప్రతినిధి ) మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం తెలంగాణ రాష్ట్ర సాంఘిక శాఖ తెలుగు నాటక అకాడమీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ హైదరాబాద్ మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం సొంత ఆధ్వర్యంలో జాతీయ స్థాయి పద్మనాటక సాంఘిక నాటక పోటీలు పాటల పోటీలు నృత్య ప్రదర్శన నిర్వహించి నందిని అవార్డు ప్రధానం చేశారు మిర్యాలగూడ కళా కేంద్ర వేదిక కళాభారతి మినీ రవీంద్ర భారతి ఆడిటోరియం ఎన్ ఎఫ్ సి క్యాంప్ మున్సిపల్ ఆఫీస్ పక్కన నిర్వహించు పద్మ నాటక సాంఘిక నాటక పోటీలలో భాగంగా మఠంపల్లి మండల కేంద్రమునకు చెందిన తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గుంటి పిచ్చయ్య ముఖ్య అతిథిగా హాజరై సాంఘిక నాటిక నటరాజ దమెటికల్ అసోసియేషన్ పెందుర్తి విశాఖపట్నం వారి నాటికను తిలకించి ప్రదర్శన పారితోషికం ఎంపిక బహుమతులను డాక్టర్ గుంటి పిచ్చయ్య చేతులు మీదుగా అందజేసి మిర్యాలగూడ కళాక్షేత్రం కొన్ని దశాబ్దాల కాలంగా పద్మ నాటక సాంఘిక నాటక పోటీలను నిర్వహించడం మినీ కళా రవీంద్ర భారతి ఏర్పాటు చేయడం అభినందనీయం అని డాక్టర్ గుంటి పిచ్చయ్య అభినందించారు ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ కళా కేంద్ర నిర్వాహకులు డాక్టర్ గుంటి పిచ్చయ్యను సన్మానించారు