మేలు జాతి దూడలతో పశుపోషణ లాభదాయకం”

జనం న్యూస్ బద్రి 14.3.26 కారంపూడి మండలం, వేపకంపల్లి గ్రామంలో శుక్రవారం మేలు జాతి లేగ దూడల ప్రదర్శన నిర్వహించారు.రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ, పశు సంవర్ధక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకం అమలులో భాగంగా మేలు జాతి లేగదూడల ప్రదర్శన ఏర్పాటు చేశారు. కారంపూడి మండల ఇంచార్జ్ పశు వైద్యాదికారి డాక్టర్. డి. దిలీప్, డాక్టర్ వి, శ్రీనివాసరెడ్డి పిడుగురాళ్ల మండలం , డాక్టర్ వెంకటేశ్వర్లు మాచవరం మండలం ,పాల్గొని ప్రదర్శన ప్రారంభించారు.డాక్టర్. డి.దిలీప్ మాట్లాడుతూ పాడిని కేవలం ఒక ఆదాయ వనరుగా చూడటమే కాకుండా లేగదూడాల పోషణను తగు జాగ్రత్తలు పాటిస్తే మంచి పాడిపోషణ సాధ్య పడుతుందని చెప్పారు. గేదె జాతి పశువుల పునరుత్పత్తి చలికాలం అనుకూలమైనది అని వివరించారు.రైతులు, పశువుల్లో ఎద లక్షణాలు గమనించి వేసవి కాలానికి ముందే కృత్రిమ గర్భోత్పత్తి చేయించడం వలన పశుపోషణ మరింత వృద్ధి చెందుతుందని, లాభదాయకంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమం లో పాల్గొన్న దూడలకు నట్టల నివారణ మందులు పైపరజైన్ తాపించారు . దూడల యొక్క మరణాల శాతం తగ్గించడం, పెయ్యాదూడలు పుట్టేందుకు SSS సెమెన్ గురించి తెలిపారు. దూడలలో తెల్ల వీరేచనలు కాకుండా ముందు నుంచే జాగ్రత్త వహించాలని తెలియపరిచారు.ఈ ప్రదర్శన లో 35 మంది రైతులు పాల్గొని 42 దూడలను ప్రదర్శించారు.ప్రదర్శన లో పాల్గొన్న పశుపోషకులకు ప్రోత్సాహక బహుమతులు, మినరల్ మిక్సర్, లివర్ టానిక్ లు అందచేశారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథులు గా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంగులూరి అంజయ్య, కారంపూడి మండల ఎంపీపీ బోల్నేడి కనకదుర్గ శ్రీనివాసరావు, కారంపూడి టీడీపీ పార్టీ అధ్యక్షుడు గొల్ల సురేష్,, పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *