ఆదర్శ పాఠశాలలోని ప్రవేశాలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి – ప్రిన్సిపాల్ మేకల రమేష్

జనం న్యూస్ జనవరి 20 చిట్యాలమండల ప్రతినిధి శ్రీనివాస్, జయశంకర్ జిల్లా చిట్యాల మండలం కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ఆదర్శ పాఠశాల/ కళాశాలలో 2026 – 2027 సంవత్సరం గాను ఆరవ తరగతి ప్రవేశాలతో పాటు ఏడు నుండి పదవ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తు న్నట్లు ఆదర్శ పాఠశాల/ కళాశాల ప్రిన్సిపాల్ మేకల రమేష్ పత్రికా ప్రకటనలో తెలియజేశారు ఈ పరీక్షలకు సంబంధించి ఆన్లైన్లో ఈనెల 28వ తారీకు నుండి ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 19న ఆరవ తరగతి కోసం సమయం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు 7 నుండి 10వ తరగతి వారికి మధ్యాహ్నం సమయం రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు అడ్మిషన్ టెస్ట్ ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని చిట్యాల మండలంలోని విద్యార్థిని విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *