జనం న్యూస్ మునగాల జనవరి 20, కోదాడ పట్టణ పరిధిలోని బాలాజీ నగర్ లోని కె ఆర్ ఆర్ కళాశాలలో సోమవారం నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లకు శిక్షణ కార్యక్రమాన్ని, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ ల పాత్ర కీలకమని, ప్రజల మౌలిక వసతుల కల్పన కే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం విడుదల చేసే నిధుల సద్వినియోగం పై సర్పంచ్ లకు అవగాహన ఉండాలని,శిక్షణ ద్వారా వారి విధులు, బాధ్యతలను తెలుసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే పథకాల నిధులను సక్రమంగా వినియోగించుకుని ప్రజల మౌలిక అవసరాలు తీర్చే దిశగా కృషి చేయాలని సూచించారు.
