యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్‌కు శంకుస్థాపన

జనం న్యూస్ జనవరి 20 ఆసిఫాబాద్ అర్సి ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని వాంకిడి మండలం బెండార గ్రామం వద్ద రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న తెలంగాణ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ దండే విఠల్, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ పాల్గొన్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్‌లను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఈ పాఠశాల ద్వారా పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా అత్యాధునిక వసతులతో ఈ విద్యాసంస్థను నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాక్షి వార్త రూపం లో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *