ఘనంగా విజయదుర్గా పీఠాధిపతి గాడ్ జన్మదిన వేడుకగాడ్ ఆశీస్సులు పొందిన ఎమ్మెల్యే వేగుళ్ల ,నల్లమిల్లి

జనం న్యూస్ ప్రతినిధి మండపేట నియోజకవర్గం అంగర వెంకట్ జనవరి 20, విజయ దుర్గా పీఠాధిపతి గాడ్ జన్మదిన వేడుకను సోమవారం ఘనంగా నిర్వహించారు. 90 వ జన్మదినం వేడుక పురస్కరించుకుని రాయవరం మండలంలోని వెదురుపాక విజయ దుర్గ పీఠాన్ని సర్వాంగ సుందరంగా, వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. వేకువ జాము నుండి విజయ దుర్గ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయ దుర్గా పీఠాధిపతి కి మంగళ స్నానం నిర్వహించి, పాద పూజలు, పుష్పాభిషేకాన్ని నిర్వహించారు. వివిధ భక్తి గీతాలతో సభా ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది. రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఏవి శేష సాయి, రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గురువుల జ్ఞాన ప్రబోదతోనే ఆధ్యాత్మిక ప్రశాంతత కలుగుతుందని అన్నారు. రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, అనపర్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గురు బోధనలు పాటిస్తేనే మానసిక సంతృప్తి కలుగుతుందని పేర్కొన్నారు. ఆధ్యాత్మికవేత్తల ప్రసంగంతో సీతా సదన్ మానసిక ఆనందం సోబిల్లింది.ఈ కార్యక్రమంలో తెలంగాణ కు చెందిన భక్తులు కూడా పాల్గొని గాడ్ ఆశీస్సులు పొందారు. జన్మదిన వేడుకను పురస్కరించుకొని వెదురుపాక గ్రామమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది.ఈ కార్యక్రమంలో పీఠం పర్యవేక్షకుడు బాపిరాజు,పి ఆర్ ఓ వాడ్రేవు వేణుగోపాల్ (బాబి), విజయ దుర్గ సేవాసమితి ప్రతినిధులు గాదె భాస్కర నారాయణ, సత్య వెంకట కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *