అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతున్న మెదక్

*ఆరు నెలల్లో మెదక్ రూపు రేఖలు మారుస్తాం *వచ్చే ఎన్నికల్లో మీరే ఓట్లు వేసే విదంగా అభివృద్ధి చేస్తాం *మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి *మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ లక్ష్యం *అర్హులైన పేదలందరికి ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తాం *మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు

జనం న్యూస్ 2026 జనవరి 20 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్) మెదక్ పదేళ్లు పాలించిన బిఆర్ఎస్ తెలంగాణను అప్పుల రాష్ట్రాంగా మార్చారనీ మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనం పల్లి రోహిత్ రావు విమర్శించారు. మెదక్ పట్టణంలోని జికెఆర్ గార్డెన్స్ లో రూ 90 లక్షల వడ్డీలేని రుణాలను మహిళా సంఘాలకు అందజేశారు. అనంతరం ఇందిరమ్మ చీరలను పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ లో మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్పనిచేస్తుందన్నారు.అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులోమెదక్దూసుకుపోతుందన్నారు.ఆరు నెలల్లో మెదక్ రూపు రేఖలు మారుస్తామన్నారు. అధికారంలోకి వచ్చినా రెండేళ్ల లో రూ 140కోట్ల తో అభివృద్ధి పనులు చేశామని, మరో రూ 100 కోట్ల అభివృద్ధి నిధులు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆరు నెలల్లో పనులు చేసి చూపిస్తామన్నారు. తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల్లో చేసిచూపిస్తామన్నారు. బిఆర్ఎస్ నేతలు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి మభ్య పెట్టారని ఆరోపించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి మోసం చేస్తుందుకు వస్తున్నారని, వారి మోసాలకు లొంగకుండా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. పేదలందరికి సన్నబియ్యం ఇస్తున్నామన్నారు. పదేళ్లలో ఇళ్ళు లేని పేదలకు ఒక్క డబుల్ బెడ్ రూం ఇవ్వలేరని, తాము అర్హులైన పేదలందరికి ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నామన్నారు. బిఆర్ఎస్ సర్కార్ విద్య, వైద్యాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. అత్యాధునిక హంగులతో రామాయంపేట లో రూ 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నామన్నారు.తెలంగాణ లో ప్రసిద్ధి గాంచిన ఏడుపాయలకు రూ 30 కోట్లు, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మెదక్ చర్చి కి రూ 33 కోట్లను సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారని, పనులుకూడాజరుగుతున్నాయన్నారు. తమ అభివృద్ధి చూసి వచ్చే ఎన్నికల్లో తాము అడగకుండానే ఓట్లు వేస్తారన్నారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మెప్మా పిడి హన్మంత్ రెడ్డి, టౌన్ మిషన్ కోఆర్డినేటర్ సునీత పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మందుగుల గంగాధర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్ రావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్ కాంగ్రెస్ నేతలు తోడుపునూరి శివ రామకృష్ణ, దుర్గాప్రసాద్,బొద్దుల కృష్ణ లింగం, వసంత్ రాజ్, గోదల సాయి, నిఖిల్, అంజాద్, దయా సాగర్, ఉమర్, పోచేందర్, జ్యోతి, గోదల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *