జనం న్యూస్ జనవరి 20 సిద్దిపేట రూరల్ రిపోర్టర్ జోగారి రాకేష్, సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో పుల్లూరు బండ జాతర మరియు శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వంగ రాజేశ్వర్ రెడ్డి స్వామివారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, స్వామివారి కృపతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురా రోగ్యాలతో, పంట పొలాలు పాడి పశువులు చల్లగా ఉండాలని కోరారు. జాతర ఉత్సవాల నిర్వహణకు సహకరించిన ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వంగ రాజేశ్వర్ రెడ్డి ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుంచం లత వెంకట్ యాదవ్, ఉప సర్పంచ్ ఒగ్గు రాజేష్,ఆలయ కమిటీ చైర్మన్ పుల్లూరి కనకయ్య, వార్డు సభ్యులు యోగి ప్రవీణ్,వైకుంఠం, శ్రీను,సురేష్, రాజు,అనిల్, రాకేష్, శివ తదితరులు పాల్గొన్నారు.