జనం న్యూస్ డిసెంబర్(20) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి వర్గం తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో సోమవారం నాడు తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తిరుమలగిరి పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సన్నాహక సమావేశం కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మున్సిపాలిటీ చైర్మన్ పదవిని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.