జనం న్యూస్, కూడేరు జనవరి 20, రిపోర్టర్ ముంగా ప్రదీప్ కూడేరు మండల పరిధిలోని గొటుకూరు గ్రామంలో 5 శతాబ్దాల క్రితం శివుని ప్రతిరూపంగా దక్షిణ భారతదేశంలోని ఒకటిగా ఐదు వందల సంవత్సరాల క్రితం వెలిసినటువంటి శ్రీ శ్రీ మహాకాలభైరవ స్వామివారికి, అమావాస్య ను పురస్కరించుకొని ఆదివారం రోజున సాయంకాలం 6:00 గంటలకు గొటుకూరు మహా కాలభైరవ స్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలలో భాగంగా ఉత్తర కాశీ గంగతో అభిషేకాలు నిర్వహించిన పిదప కాలభైరవు స్వామికి పాలాభిషేకం, పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం, జమ్మూపత్రి బిల్వార్చనతో, పెద్ద ఎత్తున అభిషేకాలు, హోమాలు నిర్వహించిన అనంతరం స్వామివారికి వివిధ పూజ పుష్పాలతో అలంకరించి కుష్మాండ, ఆకాశదీప, నైవేద్యం, మహామంగళ హారతి తదితర విశేష పూజ కార్యక్రమాలు నిర్వహణ అనంతరం పశ్చిమ బెంగాల్ నుండి తార పీట్ బీరాచారి అఘోరి సాదా బాబా మరియు కాశీ క్షేత్ర పాలకులైన స్వామీజీలను భక్తిశ్రద్ధలతో తప్పేట్టు మంగళ వాయిద్యాలు నడుమ పురవీధుల గుండా భక్తిశ్రద్ధలతో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించిన పిదప మహా కాలభైరవ స్వామి ఆలయ సన్నిధికి చేరుకొని విశిష్ట పూజలు మహా మంగళ హారతులు నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమాలకు సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడింది. ఈ పూజా కార్యక్రమాలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమావాస్య సందర్భంగా కాలభైరవ స్వామి దర్శన నిమిత్తం వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ప్రాంగణం నందు పెద్ద ఎత్తున అన్న ప్రసాద కార్యక్రమాలు నిర్వహించినట్లు గ్రామ పెద్దలు తెలియజేశారు.
