మహనీయుడుఎన్.టి.ఆర్ కు ఘన నివాళులు అర్పించిన ముక్కారూపానంద రెడ్డి,ఎమ్మెల్యే అరవ శ్రీధర్, యువనేత ముక్కాసాయివికాస్ రెడ్డి,కాపెర్ల.చంద్ర శేఖర్ నాయుడు

జనం న్యూస్ జనవరి 20 పుల్లంపేట, ఆంధ్రుల ఆశాజ్యోతి, నటసార్వభౌముడు,మాజీ ముఖ్యమంత్రివర్యులు నందమూరి తారకరామారావు 30వ వర్ధంతి సందర్భంగా పుల్లంపేట మండలంరెడ్డిపల్లి చెరువుకట్ట, టి.కమ్మపల్లి క్రాస్ రోడ్డు వద్దనున్న ఎన్.టి. రామారావు విగ్రహమునకు రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్,కు.డా చైర్మన్ ముక్కారూపానందరెడ్డి, మరియు ఎమ్మెల్యే,ప్రభుత్వవిప్ ఆరవ శ్రీధర్, యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డితో కలిసి మహనీయునికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి ఘన నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవలం 9 నెలలు లో తెలుగుదేశం పార్టీని స్థాపించి కాంగ్రెస్ పార్టీని చిత్తు,చిత్తుగా ఓడించి ఘనవిజయం సాధించి ఢిల్లీ పెద్దలను దడదడలాడించిన మహనీయుడు కూడు,గూడు, గుడ్డ నినాదంతో పేదల పాలిట పెన్నిధి గా అవతరించి వృద్ధులకు వృద్ధాపించిన, పేదలకు పెంకుటిల్లులు, రైతన్నలకు ఉచిత విద్యుత్తు, రైతన్నలు ఎన్నో ఏళ్లగా బ్యాంకుబకాయిలు చెల్లించలేక అష్ట కష్టాలు పడుతున్న సమయంలో అవతార పురుషుడిగా వచ్చి రుణమాఫీ చేసి రైతుల పాలిట పెన్నిధిగా నిలచి తెలుగు వాడి సత్తాను మన దేశమునకే గాక యావత్ ప్రపంచానికే తెలియజేసిన మహానుభావుడిని మనం ఎప్పుడు మరువకూడదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పుల్లంపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాపెర్ల చంద్రశేఖర్ నాయుడు, జనరల్ సెక్రెటరీ పోలి జగదీశ్వర్ రెడ్డి, క్లస్టర్ఇంచార్జ్ ముద్దా సుభాష్ రెడ్డి, చుండుఈశ్వర నాయుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్రయ్య నాయుడు,వైస్ చైర్మన్ చిన్నం శివయ్య, పోలూరు కృష్ణమ నాయుడు,లింగుట్ల వెంకటరమణ నాయుడు,కేసినేని నారాయణ నాయుడు, వెంకటసుబ్బయ్య యాదవ్ భీమిశెట్టి నారాయణ,సెక్రటరీలు జీ.కే సుబ్బారెడ్డి, పెద్దినారాయణ, సుధాకర్ రెడ్డి, ఆదినారాయణరెడ్డి, రామచంద్రారెడ్డి,రెడ్డయ్య రెడ్డి, పోలుప్రేమ కుమార్, కాపెర్ల వెంకట నారాయణనాయుడు, పట్టాభిరామానాయుడు, శంకరయ్య నాయుడు సుబ్బారాయుడునాయుడు, వెంకటాద్రి నాయుడు,ఓలేటి వెంకట్, కర్నూతల మణి,ఎస్.సి సెల్ నాయకులు కొండంపల్లి మల్లి, శివ, గోపదాల శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *