జనం న్యూస్ మధిర జనవరి 19, దోర్నాల కృష్ణ స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలు ఘనంగా మధిర లో నిర్వహించారు. దీనిలోని భాగంగా మధిర పట్టణం లోని రైల్వే గేట్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు రాష్ట్ర టిడిపి నాయకులు చేకూరి శేఖర్ బాబు,మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు మల్లాది హనుమంతరావు, సీనియా టిడిపి వంకాయలపాటి నాగేశ్వరరావు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కారణజన్ముడు,యుగ పురుషుడు, పేదల పెన్నిధి, ‘అన్న’ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పిస్తున్నానని పేర్కొన్నారు సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలిగి, రాజకీయ కురుక్షేత్రంలో అజేయుడైన ‘అన్న’ ఎన్టీఆర్ తరతరాల చరిత్రను తిరగరాసిన ధీరోదాత్తుడని అభివర్ణించారు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టేందుకు పోరాటం చేసిన ఆయన మనందరికీ ప్రాతఃస్మరణీయుడన్నారు. కిలో రెండు రూపాయల బియ్యం, సామాజిక భద్రతా పింఛన్లు, పక్కా ఇళ్ల నిర్మాణం, రైతుకు విద్యుత్, మండల వ్యవస్థతో స్థానిక స్వపరిపాలన, ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు, తాగునీటి ప్రాజెక్టులు లాంటి అనితరసాధ్యమైన సంక్షేమ అభివృద్ధి పథకాలతో చరిత్ర గతిని మార్చిన ఆ మహనీయుడు మనకు ఆదర్శమని టిడిపి నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షులు మర్నీడు పుల్లారావు, మేడ వెంకటేశ్వరరావు, గడ్డం రమేష్, గడ్డం మల్లికార్జున్, వాసిరెడ్డి శివాజీ, చేకూరి కృష్ణారావు, యడవల్లి శ్రీధర్, మైనీడి జగన్మోహన్రావు పుట్టి భాస్కర్, ములకలపల్లి వినయ్, పత్తిపాటి కృష్ణారావు, వంశి, సటు వెంకటేశ్వర్లు, తదితర ముఖ్య నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు