జనం న్యూస్ జనవరి 19 , బోధన్ నియోజవర్గం బోధన్ నియోజవర్గం లో సాలూర మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతిని సాలుర గ్రామం యువ నాయకులు ఆయన అభిమాన వర్గం సంఘని సంజీవ్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆయన అభిమాన వర్గం ఎల్లవేళలా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఇల్తెపు శంకర్ సొక్కం రవి, ఉపసర్పంచ్ బుయ్యన్ సురేష్ పటేల్, కన్నె హన్మండ్లు, ఇల్తెపు గంగారం, కేజీ గంగారాం, భాస్కర్, సాయన్న, శేఖర్, జాఫర్, సాయిలు, శివప్రసాద్, రవి, గ్రామపెద్దలు, గ్రామస్తులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.