జనం న్యూస్ మార్చ్ 22 మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: జవహర్ నగర్ లో రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కమిటి అధ్యక్ష, కార్యదర్శులు మహ్మద్ పాషామియా, టి.కాలేషా.
ఎవరైతే ఖురాన్ ఆదేశాలను అనుసరించి, నియమ, నిభందనలతో జీవితాన్ని అనుసరిస్తారో వారు శాంతి, నిష్టతో కూడిన ఉత్తమమైన జీవితంతో పాటు అల్లాహుతా అల్లా సొల్లాలాహు అలైహ్ కు అత్యంత ప్రీతి పాత్రులు అగుదురని గుర్తుచేస్తూ జవహర్ నగర్ జీహెచ్ఎంసి పరిధిలో గల పలు ఈద్ఘాలలో ప్రార్థనలు ప్రశాంతంగా జరిగాయి. మార్చ్-21, 2026, శనివారం రోజున కాప్రా, మేడ్చల్ లోని జవహర్ నగర్, వికలాంగుల కాలనీ గల నయా ఈద్ఘాలో సైయద్, ముబషీర్(అబ్బు), ఎం.డి.మోయినుద్దీన్, వెంకటేశ్వర కాలనీ పాత ఈద్ఘాలో ఎస్.కె.అహ్మద్, అంబేద్కర్ నగర్ ఈధ్ఘాలో ఎం.డి.ఒమర్ షరీఫ్, మల్కారం ఈధ్ఘాలో మహ్మద్ షాబుద్దీన్(అబ్బు), ఫరానగర్ ఈధ్ఘాలో ఎం.డి. కరమ్ ఖాన్, అరుంధతీ నగర్ ఈద్ఘాలో ఎస్.కె.సుల్తాన్న్, వై.ఎస్.ఆర్. డంపింగ్ యార్డ్ ఈధ్ఘాలో ఎం.డి. జావేద్ ఆధ్వర్యంలో రంజాన్ ప్రార్థనలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్భంగా జవహర్ నగర్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు మహ్మద్ పాషామియా, టి.కాలేష , జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్, మాజీ సర్పంచ్ కారింగుల జ్యోతి శంకర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు మట్ల. వినయ్ కుమార్, ఎన్. ఎస్. వి. ఐ. సాయికుమార్, జవహర్ నగర్ లోని అన్నివర్గాల ప్రజాలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ నలుమూలలో మానవ మనుగడను దెబ్బతీస్తున్న యుద్దాల మధ్య బరించలేని ఆవేధనతో ప్రార్థనలు చేసుకోవడం జరిగిందని అన్నారు. ప్రేమ పూర్వకమైన మానవత్వంతో యుద్దాలు ఆగి, ప్రపంచ శాంతికి దోహద పడాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పటిష్టమైన భద్రతను కల్పించిన సిఐ. సైదులు, ఎస్సై. రామ్ నాయక్ ప్రార్థనలు సజావుగా జరగడానికి సహకరించిన పోలీసు అధికారులకు, పోలీసులకు మరియు ప్రభుత్వ పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.