రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలి

★ రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు. ★ రూ. 2.10 కోట్లతో నూతన భవన నిర్మాణం త్వరలో పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని గుత్తేదారుడికి ఆదేశించిన మంత్రి. ★ హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం నినాదం. ★ ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు ప్రోత్సహించండి వైద్యులకు ఆదేశించిన మంత్రి.

జనం న్యూస్ మార్చి 21 కోటబొమ్మాళి మండలం: ఆసుపత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు వైద్యుల‌ను ఆదేశించారు. కోట‌బొమ్మాళిలో శుక్ర‌వారం ప్ర‌భుత్వ సామాజిక ఆసుప‌త్రిని మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆసుపత్రిలోని పలు వార్డులు, మందుల నిల్వ గది తదితర వాటిని స్వ‌యంగా సందర్శించారు. ఆసుప‌త్రికి వ‌చ్చే రోగులు వివ‌రాలు రికార్డుల్లో నమోదు వివరాలను పరిశీలించారు. వైద్య పరికరాల పనితీరు తెలుసుకొని ఆసుపత్రిలో నిర్వహిస్తున్న వివిధ వైద్య పరీక్షలు వాటి నివేదికలు తెలియ జేయుటకు పట్టే సమయం, వ్యాధి నిర్దారణ పరీక్షల కిట్లు లభ్యత తదితర వివరాలపై సిబ్బందిని ఆరా తీశారు. వార్డులో రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలు, సదుపాయాలపై అడిగి తెలుసు కున్నారు. నిల్వలు, రక్త పరీక్షల విభాగాలను తనిఖీ చేశారు. ఆసుపత్రి సిబ్బంది అన్ని వేళలా అందుబాటులో ఉండాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయ‌ని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు ప్రోత్సహించండి వైద్యులకు ఆదేశించారు. నూతనంగా నిర్మ‌స్తున్న భ‌వ‌నంలో అతిత్వ‌ర‌లో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. కూట‌మి ప్ర‌భుత్వం వైద్యానికి అధిక ప్ర‌ధాన్నాత ఇస్తుంద‌ని ప్ర‌తి ఒక్క‌రూ ఆరోగ్యంగా ఉండాల‌న్న‌దే ముఖ్య మంత్రి చంద్ర‌బాబు నాయుడు ల‌క్ష్య‌మ‌ని అన్నారు. ప్రజారోగ్యానికి ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. పీఎసీఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్, టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, తెలుగు దేశం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.