రంజాన్ సందర్బంగా ముస్లిం సోదరులతో కలసి ఈద్గాలో ప్రార్ధనల్లో పాల్గొన్న ఉరవకొండ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి

* ముస్లిం, మైనార్టీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి. * అల్లా అనుగ్రహంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి. * ముస్లిం మైనార్టీలు ఆర్థికంగా ఎదగాలి.

జనం న్యూస్ ఉరవకొండ మార్చ్ 22 రిపోర్టర్ ముంగ ప్రదీప్: ముస్లిం మైనార్టీలు ఆర్థికంగా ఎరగాలన్న లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని అందుకు మనం కూడా అండగా నిలవాలని మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ సందర్బంగా ముస్లిం సోదరులు పవిత్రంగా బావించే ఈద్గా మైదానంలో ముస్లిం మైనార్టీ సోదరులతో కలసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ముస్లిం సోదరులందరికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికి రంజాన్ పండుగలను మీమధ్య జరుపుకోవడం నా అదృష్టంగా బావిస్తున్నానని, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి కూడా ముస్లిం మైనార్టీలు ఆర్థికంగా ఎదగడానికి అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిందని, అందరూ సంతోషంగా ఉండాలని కోరారు. బెలుగుప్ప మండలం, ఉరవకొండ పట్టణంలో పలు కాలనీలోని మాధర్సా అసంపూర్తిగా ఆగిందని నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని ముస్లిం సోదరులు కోరారని తప్పకుండా త్వరలో పూర్తి అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ముస్లిం సోదరులు ఉరవకొండ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పిఎసి మెంబర్ వై విశ్వేశ్వర్ రెడ్డి ను ఘనంగా సన్మానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *