మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను పరామర్శించిన

* మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర.

జనం న్యూస్, సాలూరు, మార్చి 22: మాజీ మంత్రి ప్రస్తుత ఏపీ శాసన మండలి విపక్షనేత అయినటువంటి బొత్స సత్యనారాయణ ఈ మధ్యనే బ్రెయిన్ స్టోక్ కు గురై అనారోగ్యంతో బాధ పడుతూ హైదరాబాద్ లో చికిత్స పొందిన తర్వాత వైద్యులు సూచనలు మేరకు విజయనగరంలో ఉన్న ఆయన నివాసం లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీమంత్రి వర్యులు మరియు మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు అయినటువంటి పీడిక రాజన్న దొర విజయనగరం వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్న మాజీ మంత్రి, విపక్ష నేత అయిన బొత్స సత్యనారాయణను పరామర్చించారు. రాజన్న దొర తో పాటు పరామర్శించిన వారిలో నెలిమర్ల మాజీ ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు కూడా ఉన్నారు. వీరు ఇరువురు ఎమ్మెల్సీ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *