పేదవారి ఆకలి తీర్చడంలో రంజాన్ పౌనఃపున్యాన్ని చాటింది

జనం న్యూస్, మార్చి 22 మధిర టౌన్ ప్రతినిధి నండ్రు సుందర్ రావు: నీతి,నిజాయితీ, క్రమశిక్షణ ఆధ్యాత్మిక మార్గాన్ని ఏడాదంతా కొనసాగించాలి. ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆధ్యాత్మిక గురువులు మౌలానా షేక్ ముజాహిద్ రంజాన్ మాసంలో పాటించిన నీతి, నిజాయితీ, క్రమశిక్షణ ఆధ్యాత్మిక మార్గాన్ని ఏడాదంతా కొనసాగిస్తే ఉన్నత పౌరులుగా ఎదగొచ్చు అని తెలంగాణ ముస్లిం ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆధ్యాత్మిక గురువులు మౌలానా షేక్ ముజాహిద్ అన్నారు. శనివారం రంజాన్ పండుగ సందర్భంగా మధిర పట్టణంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెరిజల్లుతూ రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) వేడుకలను అల్లాహ్ నామస్మరణతో ముస్లిం సోదరులు పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మధిర ఈద్గా వద్దకు వందలాది మంది ముస్లిములు చేరి సామూహిక ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం జరిగిన ధార్మిక సందేశంలో గురువులు మౌలానా షేక్ ముజాహిద్ రంజాన్ సందేశాన్ని బోధించారు. రంజాన్ పండుగ సమానత్వానికి, మానవత్వానికి, నిలువుటద్దమని ముజాహిద్ తెలిపారు. సోదరులు నెలరోజుల పాటు కఠినమైన ఉపవాస దీక్షలు చేపట్టి, క్రమశిక్షణతో కూడిన జీవనాన్ని గడపడం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ముఖ్యంగా జకాత్ వంటి దానధర్మాల ద్వారా పేదవారి ఆకలి తీర్చడం రంజాన్ పౌనఃపున్యాన్ని ఈ మాసం చాటిందన్నారు. పౌరులు నీతి, నిజాయితీ క్రమశిక్షణతొ కూడిన జీవనాన్ని ఎంచుకోవాలి అన్నారు. మనిషి మంచి ప్రవర్తన సమాజంలో గౌరవాన్ని పెంచుతుందని వివరించారు. అలాగే సమాజం వెనుకబడిన వర్గాలను ఆదుకోవడానికి తెలంగాణ ముస్లిం ఐక్య సంఘం ఈ మాసంలో లక్షలాది రూపాయలు వెచ్చించి జాకత్ వంటి నియమాలను పాటిస్తూ వేలాది తోఫా కిట్లను కుల మతాలకు అతీతంగా అందించిందని తెలిపారు. సమాజంలో శాంతి కోసం మనం చేసే పవిత్ర ప్రార్థనలు దోహదపడాలని సోదరులకు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *